రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 19 మంది మంత్రుల్లో ఏకంగా 13 మంది మంత్రులు ఓడిపోయారు. కేవలం ఆరు మంది మాత్రమే విజయం సాధించారు. వీరిలో ఇద్దరు తమకు కాదని తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకుని బయటపడ్డారు.
కాగా, గెలిచిన వారిలో ఝాల్రాపాటన్ నుంచి ముఖ్యమంత్రి వసుంధరారాజే, మాలవీయ్‌నగర్ నుంచి వైద్యశాఖ మంత్రి కాళీచరణ్ సరాఫ్, బాలీ నుంచి విద్యుత్‌శాఖ మంత్రి పుష్యేంద్రసింగ్, దక్షిణ అజ్మేర్ నుంచి శిశు సంక్షేమశాఖ మంత్రి అనీతా భదెల్, ఉత్తర అజ్మేర్ నుంచి విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ, చూరూ నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్, రాజ్‌సమంద్ నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి కిరణ్ మాహేశ్వరి, ఉదయ్‌పూర్ నుంచి హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాలు ఉన్నారు.