Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టపాసుల మోత మోగుతుందనుకుంటే.. తడిసిన తారాజువ్వలా తుస్సుమంది: రాహుల్

కేంద్ర బడ్జెట్ 2017పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్‌లో తాము మెరుపుల కోసం ఎదురుచూస్తే.. అలాంటివేమీ లేకుండా ప్రసంగం చాలా చప్పగా ముగిసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ అ

టపాసుల మోత మోగుతుందనుకుంటే.. తడిసిన తారాజువ్వలా తుస్సుమంది: రాహుల్
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:55 IST)
కేంద్ర బడ్జెట్ 2017పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్‌లో తాము మెరుపుల కోసం ఎదురుచూస్తే.. అలాంటివేమీ లేకుండా ప్రసంగం చాలా చప్పగా ముగిసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యువతకోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఏమీ చేయలేదని రాహుల్ తెలిపారు.
 
రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించేందుకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతిస్తామన్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2017-18 సార్వత్రిక బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపర్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బడ్జెట్ వల్ల రైతులకు, యువతకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. 
 
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం అనంతరం రాహుల్ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ... ''మేము టపాసుల మోత మోగుతుందని ఆశించాం. తీరా చూస్తే బడ్జెట్ 2017-18 తడిసిపోయిన తారాజువ్వలా తుస్సుమంది'' అని ఎద్దేవా చేశారు.  
 
ఇదిలా ఉంటే.. ఇకపై దేశ ఆర్థికవ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీకి అభినందనలు తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం ద్వారా మొత్తంగా రవాణా వ్యవస్థను ఒకే గొడుగుకిందకు తెచ్చామని మోదీ పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో భద్రత నిధి కీలకమన్నారు. నల్లధనం నియంత్రణకు కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు.
 
బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు. బడ్జెట్‌లో అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : బడ్జెట్ తర్వాత ధరలు పెరిగేవి - ధరలు తగ్గేవి ఏవి?