Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : బడ్జెట్ తర్వాత ధరలు పెరిగేవి - ధరలు తగ్గేవి ఏవి?

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రజలకు ఊరట కలిగించేలా కొన్ని అంశాల్లో, మరికొన్ని అంశాల్లో వాత పెట్టేలా ఉంది. బడ్జెట్ తర్వాత కొన్నింటిలో ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా.. రైల్వే ఈ-టికెట్స్, వైద్య

అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : బడ్జెట్ తర్వాత ధరలు పెరిగేవి - ధరలు తగ్గేవి ఏవి?
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:20 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రజలకు ఊరట కలిగించేలా కొన్ని అంశాల్లో, మరికొన్ని అంశాల్లో వాత పెట్టేలా ఉంది. బడ్జెట్ తర్వాత కొన్నింటిలో ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా.. రైల్వే ఈ-టికెట్స్, వైద్య పరికరాలు, ఔషధాలు, సీసీటీవీ కెమెరాలు, మౌలిక రంగంలో వాడే యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, ఈ-పాస్ యంత్రాలు, స్వైపింగ్ మెషీన్లు, ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ డేటా తదితరాల ధరలు తగ్గనున్నాయి. అలాగే, సిగరెట్లు, లగ్జరీ కార్లు, బైకులు, సరకు రవాణా, దిగుమతి చేసుకునే ఆభరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. 
 
అయితే వేతన జీవులకు ఈ దఫా కూడా ఆయన నిరాశపరిచారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యధాతథంగా ఉంచారు. దీనికి కారణం.. పన్ను ఆదాయాన్ని మరితంగా పెంచుకోనున్నట్టు చెప్పకనే చెప్పారు. వాస్తవానికి దేశంలో ఎన్నో కోట్ల మంది వార్షిక సంపాదన రూ.5 లక్షలకు మించి ఉండగా, వసూలవుతున్న పన్ను అతితక్కువగా ఉండటం అభివృద్ధికి విఘాతంగా ఉందని, ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. 
 
పన్ను- జీడీపీ నిష్పత్తి చాలా తక్కువగా చెప్పుకొచ్చిన ఆయన, ప్రత్యక్ష పన్నుల వసూళ్లను క్రమంగా పెంచుతామని అన్నారు. వ్యవస్థీకృత రంగంలో 4.2 కోట్ల మంది ఉన్నప్పటికీ, 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్నులు దాఖలు చేస్తున్నారని, 5 కోట్లకు పైగా కంపెనీలు రిజిస్టరై ఉండగా, అత్యధిక కంపెనీలు నష్టాలను చూపుతున్నాయని ఆయన గుర్తు చేశారు. 
 
కేవలం 7,781 కంపెనీలు మాత్రమే రూ. 10 కోట్లకు మించిన లాభాన్ని చూపాయని జైట్లీ గుర్తు చేశారు. గడచిన సంవత్సరం 3.7 కోట్ల మంది రిటర్న్ లు దాఖలు చేయగా, అందులో 99 లక్షల మందికి పైగా రూ. 2.5 లక్షల లోపు ఆదాయాన్ని చూపారని, మరో 1.9 కోట్ల మంది రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు, 52 లక్షల మంది రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ, 24 లక్షల మంది రూ. 10 లక్షలపైబడిన ఆదాయం చూపారని తెలిపారు. మొత్తం 76 లక్షల మంది రూ. 5 లక్షలకు పైగా ఆదాయం చూపగా, అందులో 54 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుణ్ జైట్లీ చెప్పిన ఆ లెక్కలు తిక్క ఎక్కించేలా లేవూ...? బాగా దొరికిపోతున్న వేతన జీవులు...