కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ మెకానిక్ అవతారమెత్తారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ఓ బైక్ మెకానిక్ షాపుకు వెళ్లిన ఆయన.. అక్కడ మెకానిక్‌గా మారిపోయారు. అలాగే, మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులు, మెకానిక్‌లతో ముచ్చటించి వారితో కరచాలనం చేశారు. ఈ కార్మిక చేతులే భారత్‌ను నిర్మిస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
కరోల్‌లోని ఓ మెకానిక్ షాపులో ఉన్నట్టుండి ప్రత్యక్షమైన రాహు్ల్ గాంధీ.. అందులో పని చేసే బైక్ మెకానిక్‌లతో మాట్లాడుతూ, బైక్ మెకానిక్ ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు. సైకిల్ మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులతో ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెంచీలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నట్టు చెప్పారు.
ఈ కార్మికుల చేతులో భారత్‌ను నిర్మిస్తాయని రాహుల్ అన్నారు వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం ఆత్మాభిమానమని చెప్పారు. ప్రజల నాయుకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది.