Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేదికపై రాహుల్ గాంధీని కౌగిలించుకుని ముద్దెట్టిన నీలం బాస్టియా.. ఈమె ఎవరు? (video)

Advertiesment
Rahul Gandhi

సెల్వి

, శుక్రవారం, 11 జులై 2025 (22:10 IST)
Rahul Gandhi
ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన తన 9 ఏళ్ల బాలిక.. రాహుల్ అభిమాని నీలం బాస్టియాను వేదికపై కలిశారు. కొంతసేపు తన అభిమానితో మాట్లాడిన తర్వాత, రాహుల్ ఆమెకు చాక్లెట్ అందించి, సున్నితంగా కౌగిలించుకుని, బాగా చదువుకోవాలని కోరారు. నీలం రాహుల్ గాంధీకి ముద్దు కూడా ఇచ్చింది.
 
"రాహుల్ గాంధీ నాతో మాట్లాడారు. నా పేరు, నా తరగతిని అడిగారు. నేను అతనికి నా పేరు నీలం బాస్టియా అని, నేను 6వ తరగతి చదువుతున్నానని సమాధానం ఇచ్చాను. నేను అతని ప్రశ్నలకు మరింత సమాధానమిచ్చాను, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ గణితం అని చెప్పాను. రాహుల్ గాంధీ నన్ను బాగా చదువుకోమని చెప్పారు. నాకు చాక్లెట్ ఇచ్చారు" అని నీలం బాస్టియా హ్యాపీగా చెప్పింది.
 
నీలం ఇంకా మాట్లాడుతూ, "రాహుల్ గాంధీ అంటే నాకు ఇష్టం ఎందుకంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి, సోదరుడు లేని వారికి సోదరుడు. ఆయన నాయకుడు కాదు, మా కుటుంబ సభ్యుడు. రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. నేను పెద్దయ్యాక ఐఏఎస్ అధికారిని అవుతాను. పదవీ విరమణ తర్వాత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాగా రాజకీయాలు చేస్తాను" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Loan Dispute: రుణం చెల్లించలేదు.. మహిళ ముక్కు కొరికిన ఏజెంట్