Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియా కూటమి అభ్యర్థి రాహుల్ గాంధీనే : సీఎం అశోక్ గెహ్లాట్

Advertiesment
ashok gehlot
, సోమవారం, 28 ఆగస్టు 2023 (13:18 IST)
వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ మేరకు కూటమిలోనూ చర్చించినట్లు తెలిపారు. రాహుల్ అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయని ఆయన వెల్లడించారు. 
 
అలాగే, ఇండియా కూటమిలోకి త్వరలో ఎన్డీయేలోని నాలుగైదు పార్టీలు చేరతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అలోక్ శర్మ తెలిపారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఇటీవల 38 పార్టీలతో జరిగిన ఎన్డీయే సమావేశంలో ఇవి కూడా పాల్గొన్నాయన్నారు. ముంబైలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావడంలో విపక్షాలు తొలిభేటీలో విజయవంతమయ్యాయి. మలి సమావేశంలో కూటమికి ఓ పేరు పెట్టాయి. మూడో విడతలో.. చిహ్నం (లోగో), సీట్ల పంపకం సహా పలు వ్యూహాత్మక, కీలక అంశాల మీద అవగాహనకు రానున్నాయి. ఈ నెల 31, సెప్టెంబరు 1న ముంబైలో జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' సమావేశానికి ఇదే ఎజెండాకానుంది. 
 
ఈ భేటీలో కూటమికి సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్ ఎన్నిక కూడా జరిగే వీలుందని తెలుస్తోంది. 26 పార్టీలున్న 'ఇండియా' లోకి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చే అవకాశం ఉందని.. బీహార్ సీఎం, ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న నీతీశ్ కుమార్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ఏవనేది ఆయన చెప్పలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుమానం.. సహజీవన భాగస్వామిని కుక్కర్‌తో కొట్టి చంపాడు.. ఎక్కడ?