Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్ సెల్వంతో రాఘవ లారెన్స్ భేటీ.. 500 కేజీల కేక్‌ ఆర్డర్ చేశాం.. కానీ పోలీసులు?

జల్లికట్టు ఉద్యమం చివరి రోజు రసాభాసగా మారిందని.. ఇందుకు పోలీసుల తప్పుడు అవగాహనే కారణమని ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ అన్నారు. శాంతియుతంగా ఐదురోజుల పాటు సాగిన ఉద్యమంలో అన

Advertiesment
పన్నీర్ సెల్వంతో రాఘవ లారెన్స్ భేటీ.. 500 కేజీల కేక్‌ ఆర్డర్ చేశాం.. కానీ పోలీసులు?
, సోమవారం, 30 జనవరి 2017 (14:30 IST)
జల్లికట్టు ఉద్యమం చివరి రోజు రసాభాసగా మారిందని.. ఇందుకు పోలీసుల తప్పుడు అవగాహనే కారణమని ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ అన్నారు. శాంతియుతంగా ఐదురోజుల పాటు సాగిన ఉద్యమంలో అనవసరంగా పోలీసులు రంగంలోకి దిగారని లారెన్స్ వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంను రాఘవ లారెన్స్‌తో పాటు జల్లికట్టు ఉద్యమం విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి కలిశారు. 
 
జల్లికట్టు నిర్వహణకు తగిన చర్యలు తీసుకున్నందుకు సీఎం పన్నీర్ సెల్వంకు వారు ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో భేటీకి అనంతరం రాఘవ లారెన్స్ మీడియాతో మాట్లాడుతూ, జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు జరిపిన ఉద్యమం శాంతియుత వాతావరణంలోనే జరిగిందన్నారు. ఏ నాయకుడిని కించపరిచే రీతిలో జల్లికట్టు ఉద్యమం జరగలేదని లారెన్స్ స్పష్టం చేశారు.
 
ఉద్యమం విజయవంతం కావడంతో జనవరి 23వ తేదిన 500 కేజీల కేక్ తెప్పించి మెరీనా బీచ్‌లో విజయోత్సవ సభ జరుపుకోవాలనుకున్నామని.. కానీ పోలీసులు అంతలోనే అనూహ్య పరిణామాన్ని సృష్టించారని లారెన్స్ చెప్పుకొచ్చారు. జల్లికట్టు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీలో అమోదించినందుకు సీఎం పన్నీర్ సెల్వంకు ఉద్యమం నిర్వహకుల తరుపున ధన్యవాదాలు తెలుపుకున్నామని లారెన్స్ చెప్పారు.
 
జల్లికట్టు ఉద్యమం ముగింపు రోజు జరిగిన హింసాకాండ సందర్బంగా అరెస్టు అయిన ఉద్యమకారులను విడుదల చేయాలని, గాయాలైన వారికి ప్రభుత్వం వైద్య చికిత్స అందించాలని తాము సీఎంను విజ్ఞప్తి చేసినట్లు రాఘవ లారెన్స్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అళగిరికి చెక్ పెట్టేందుకే.. స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకున్నారా? ఫ్లెక్సీలకు అందుకే మంగళం పాడారా?