Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అళగిరికి చెక్ పెట్టేందుకే.. స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకున్నారా? ఫ్లెక్సీలకు అందుకే మంగళం పాడారా?

తమిళనాట రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారపక్షం, ప్రధాన పక్షాలు నువ్వా నేనా అంటూ పోటీకి దిగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. పాలనాపరంగా అధికార పక్షానికి తాను

అళగిరికి చెక్ పెట్టేందుకే.. స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకున్నారా? ఫ్లెక్సీలకు అందుకే మంగళం పాడారా?
, సోమవారం, 30 జనవరి 2017 (14:15 IST)
తమిళనాట రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారపక్షం, ప్రధాన పక్షాలు నువ్వా నేనా అంటూ పోటీకి దిగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. పాలనాపరంగా అధికార పక్షానికి తాను సహకరిస్తానని.. ఇప్పటికే డీఎంకే వర్కింగ్ ఎంకే. స్టాలిన్.. అమ్మ మరణానికి అనంతరం ప్రకటించారు. ఇటీవల స్టాలిన్.. సీఎం పన్నీర్ సెల్వంల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం పన్నీర్ సెల్వం కాన్వాయ్‌కి స్టాలిన్ దారివ్వడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ కార్యక్రమాల్లో హంగులు, ఆడంబరాలు, ఆర్బాటాలు చెయ్యడం మానుకోవాలని స్టాలిన్ కార్యకర్తలకు సూచించారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్ లకు మంగళం పాడాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ కార్యకర్తలు ఇక ముందు ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసే సమయంలో తన ఫోటోకు బదులుగా పెరియార్, అన్నాదురై, అన్బళగన్, పార్టీ అధ్యక్షుడు కురుణానిధి ఫోటోలు వేస్తేచాలని ఎంకే. స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. 
 
సభలు, సమావేశాలు జరిగే చోట కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు వద్దని, ఇలా చేస్తే ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. సభలు జరిగే చోట ఒకటి రెండు ఫ్లెక్సీలు, సభ జరిగే తేదీ, సమయం ఉన్న వివరాలను జనం పోగు చేసుకునే విధంగా ఫ్లెక్సీలుంటే సరిపోతుందన్నారు. అయితే స్టాలిన్ నిర్ణయంపై తమిళనాట వేరొక వాదన వినిపిస్తోంది. స్టాలిన్ సోదరుడు ఎంకే. అళగిరి పుట్టిన రోజు జనవరి 30వ తేది. ఈ రోజున భారీ ఫ్లెక్సీలు ఏర్పాటవుతాయనే ఉద్దేశంతోనే 29 ఆదివారం నాడు స్టాలిన్ ఈ ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను డీఎంకే శ్రేణులు ఖండిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హే రామ్ అంటూ నేలకొరిగిన గాంధీజీ... చితాభస్మంతో ఇందిరా గాంధీ