Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

72వ గణతంత్ర ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ ట్యాంక్‌ టీ-90 భీష్మ

72వ గణతంత్ర ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ ట్యాంక్‌ టీ-90 భీష్మ
, మంగళవారం, 26 జనవరి 2021 (12:35 IST)
T-90 Bhishma
దేశ 72వ గణతంత్ర ఉత్సవాల్లో సైనిక దళాలు తమ సైనిక పాటవాన్ని చాటాయి. శత్రువులకు వెన్నులో చలిపుట్టించే ట్యాంకులు, క్షిపణులు, మల్టీ లాంఛర్ రాకెట్ సిస్టమ్‌లను ప్రదర్శించారు. ఇండియన్ ఆర్మీ ప్రధాన యుద్ధ ట్యాంక్‌ టీ-90 భీష్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 54వ సాయుధ రెజిమెంట్‌కు చెదిన కెప్టన్ కరణ్‌వర్ సింగ్ భంగూ ఈ ట్యాంక్‌ను ప్రదర్శించారు. కెప్టెన్ ఖమ్రుల్ జమాన్ నేతృత్వంలో బ్రహ్మోస్ క్షిపణి సిస్టంను ప్రదర్శించారు. 
 
భారత్-రష్యా సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణలు ఛేదించ గలవు. పినాకా మల్టీ లాంఛర్ రాకెట్ సిస్టమ్‌ ప్రదర్శనకు 841 రాకెట్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ విభోర్ గులాటీ సారథ్యం వహించారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ లాంఛర్ సిస్టమ్. తక్కువ సమయంలోనే ఈ రాకెట్ ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
 
కాగా, అప్‌గ్రేడెడ్ షిల్కా వెపన్ సిస్టమ్‌కు 140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ ప్రీతి చౌదరి సారథ్యం వహించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆర్మీ నుంచి పాల్గొన్న ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ ప్రీతి చౌదరి కావడం విశేషం. అధునాతన రాడార్, డిజిటల్ ఫైర్ కంప్యూటర్లతో షిల్కా వెపన్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో పదివేల దిగువకు పడిపోయిన కరోనా కేసులు