Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rabindranath Tagore Jayanthi: పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.. కానీ..?

Advertiesment
Rabindranath Tagore Jayanthi: పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.. కానీ..?
, శుక్రవారం, 7 మే 2021 (11:59 IST)
Rabindranath Tagore
విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 77వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం.. కోల్‌కతా‌లో 1861 మే 7జన్మించిన రవీంద్ర‌నాథ్ ఠాగూర్ చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. 
 
బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండాల్సి రావడంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచం ఒక రహస్యమనీ, దాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు. పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని ఠాగూర్ ఇంటి దగ్గరే విద్యను అభ్యసించారు. 
 
ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషును అభ్యసించేవారు. ఆదివారాలలో సంగీత, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవారు. బెంగాలీతోపాటు ఆంగ్ల భాషల్లోనూ పట్టు సంపాదించిన రవీంద్రుడు కాళిదాసు, షేక్‌స్పియర్ రచనలను ఎక్కువ ఇష్టంగా చదివేవారు.
 
ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు వెళ్లిన రవీంద్రుడు ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై మరింత అభిరుచి పెంచుకున్నారు. సాహితీవేత్తల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలు, సంగీత కచేరీలకు హాజరై ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలను ఆకళింప జేసుకున్నారు. 
 
అక్కడ తన అనుభవాలను స్నేహితుడు భారతికి లేఖలుగా రాసేవాడు. ఇంగ్లండులో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని విశ్వకవి రచించాడు. విర్గరేర్ స్వప్న బంగ, సంగీత ప్రభాత అనే భక్తి గీతాలను కూడా రాశారు. ఆయన రచనల్లో గీతాంజలి గొప్పది. బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.
 
అనంతరం దీన్ని అనేక ప్రపంచ భాషలలోకి తర్జుమా చేశారు. ప్రపంచ సాహిత్యంలో ఇది ఓ గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పదనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 
 
ఈ రచనకే 1913 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. నోబెల్ పొందిన తొలి భారతీయుడిగానే కాదు ఆసియాలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
 
రవీంద్రుడు కేవలం రచయితగానే కాదు, చిన్నారుల హృదయాలను వికసింపజేసే ప్రాచీన గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అయిదుగురు విద్యార్థులతో ఆరంభించిన విశ్వభారతి క్రమంగా విస్తరించింది. 
 
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని భావించిన రవీంద్రుడు శ్రీనికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించిన విశ్వకవి, తరువాత అనే నాటకం రాశారు. రవీంద్రుడి కలం నుంచి జాలువారిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. 
 
ప్రకృతి - ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించారు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలనే సాంఘిక ప్రయోజనం, సందేశ మిళితమైన 'గోరా' నవల రవీంద్రుని కీర్తిని మరింత ఇనుమడింపజేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా దెబ్బకు కొండ దిగిన చికెన్ ధర