Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#PunjabElectionResult2017 : పంజాబ్‌లో హస్తం పాగా... పంజాబ్ ముఖ్యమంత్రిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ?

పంజాబ్‌ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారానికి దూరంగావున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. మొత్తం 117 సీట్లు కలిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల ఆధిక్యంలో ఉంది

Advertiesment
Punjab Election Result 2017 Live
, శనివారం, 11 మార్చి 2017 (10:33 IST)
పంజాబ్‌ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారానికి దూరంగావున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. మొత్తం 117 సీట్లు కలిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తేలిపోయింది. 
 
కాగా, వరుసగా రెండుసార్లు అకాళీదల్ - బీజేపీ కూటమిని ఆదరించిన పంజాబీయులు, ఈసారి హస్తానికి ఛాన్స్ ఇచ్చారు. విజయం ఓకే.. ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు? అన్నదే అసలు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్న అమరీంద్రసింగ్ వెనుకంజలో ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ పేరు తెరపైకి వచ్చింది. ఇక అకాళీదల్, ఆప్‌లు సెకండ్ ప్లేస్ కోసం పోటీపడుతున్నాయి.
 
మరోవైపు... బీజేపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేసిన ప్రముఖ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అమృత్‌సర్ ఈస్ట్ స్థానం నుంచి పోటీచేసిన సిద్దూ.. బీజేపీ, ఆమాద్మీలకు గట్టి పోటీ ఇచ్చి విజయం దిశగా వెళుతున్నాడు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమ పార్టీకి ప్రతికూలంగా వచ్చినప్పటికీ సిద్ధూ విశ్వాసం ఏమాత్రం చెక్కుచెదరలేదు. 
 
ఎగ్జిట్ పోల్స్ కేవలం 20 వేల మంది నుంచే సేకరించారనీ.. అందుకే వాటిపై ఆధారపడదల్చుకోలేదని పేర్కొన్నాడు. ఆమాద్మీ పార్టీకి కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయనీ... అకాలీదళ్-బీజేపీ కూటమి పది సీట్లకు మించి గెలవదంటూ వ్యాఖ్యానించాడు. కాగా కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#UPElectionResults : ఉత్తరప్రదేశ్ కోటపై కాషాయ జెండా.. రామాలయం నిర్మాణం తథ్యమా?