Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 2 March 2025
webdunia

కేంద్రం సంచలన నిర్ణయం : జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

Advertiesment
jammu-kashmir

ఠాగూర్

, సోమవారం, 14 అక్టోబరు 2024 (09:40 IST)
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు ఏర్పడింది. జమ్మూకాశ్మీర్‌తో పాటు హర్యానా రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. దీంతో అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. 
 
జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు అయిందని, తద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని హోం శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. గత 2019 అక్టోబరు 31వ తేదీన జారీ చేసిన మునుపటి ఆర్డర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. తాజా ఉత్తర్వులను తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
కాగా, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని సెక్షన్ 54 ప్రకారం ముఖ్యమంత్రి నియామకానికి ముందు అక్టోబరు 31, 2019 నాటి రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేశామని గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : వచ్చేవారంంలో నోటిఫికేషన్