Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : వచ్చేవారంంలో నోటిఫికేషన్

election commission of india

ఠాగూర్

, సోమవారం, 14 అక్టోబరు 2024 (09:30 IST)
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ త్వరలో తీరిపోనుంది. దీంతో ఆ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 
 
అనేకంగా, నవంబరు నెల రెండు లేదా మూడో వారాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 45 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు సైతం జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం కూడా ఉంది.
 
కాగా, ఇటీవల హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో భారత ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ మరికొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో పోలింగ్‌ను నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 3 మధ్యలో దీపావళి, ఛత్‌ వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ పండుగల వేళ మహారాష్ట్రలో నివసిస్తున్న బిహారీ ఓటర్లు స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉందని అందుకే ఎన్నికలను నవంబరు మెుదటి వారం తర్వాతే నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం... 48 ఏపీకి భారీ వర్ష సూచన