Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి

Advertiesment
President Droupadi Murmu

సెల్వి

, బుధవారం, 2 అక్టోబరు 2024 (10:59 IST)
President Droupadi Murmu
రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. జాతిపిత గాంధీ అహింస సందేశం, సత్యాన్ని నిలబెట్టడాన్ని దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నేతలు స్మరించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఎక్స్ పోస్ట్‌లో జాతిపితకు నివాళులు అర్పిస్తూ సత్యం, అహింసకు మారురూపం అయిన బాపు జీవితం మొత్తం మానవాళికి ఒక ప్రత్యేకమైన సందేశమని అన్నారు.
 
"శాంతి మార్గాన్ని అనుసరించడానికి స్ఫూర్తినిచ్చారు. గాంధీజీ అంటరానితనం, నిరక్షరాస్యత వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టారు. మహిళా సాధికారత కోసం అవిశ్రాంతంగా పోరాడారు. గాంధీజీ శాశ్వతమైన నైతిక సూత్రాలను బోధించారు. అతని పోరాటం బలహీన వర్గాల జీవితాలను ఎంతగానో బలోపేతం చేసింది" అని రాష్ట్రపతి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నంలో తగ్గిన బంగారం ధరలు.. వివరాలివే