Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

prashant kishore

సెల్వి

, శనివారం, 23 నవంబరు 2024 (17:14 IST)
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన జన్ సూరాజ్ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఇందుకు నాందిగా బీహార్‌లో ఉప ఎన్నికలకు వెళ్లిన నాలుగు స్థానాల్లోనూ జన్ సురాజ్ అభ్యర్థులను నిలబెట్టారు. 
 
అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఒక్క సీటు (నాల్గవ స్థానంలో) మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తెలుస్తోంది. 
 
కానీ బీహార్ రాజకీయాల్లో సరైన ముద్ర వేయడానికి ఇది చాలా దూరంగా ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు సీట్లు గెలుస్తారని ఆశించారు కానీ ఈ ఫలితం పూర్తిగా నిరాశపరిచింది. వచ్చే ఏడాది వేసవిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?