Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొబైల్ పోర్టబులిటీ తరహాలోనే సెటాప్ బాక్స్‌ల పోర్టబులిటీ...

Advertiesment
Set-top Box
, సోమవారం, 28 జనవరి 2019 (13:39 IST)
చాలామంది వినియోగదారులు తమతమ కేబుల్ ఆపరేటర్ లేదా డీటీహెచ్ కంపెనీలతో విసిగిపోతుంటారు. డబ్బులు మాత్రం నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. కానీ, సర్వీసు మాత్రం అధ్వాన్నంగా ఉంటాయి. కేబుల్ ప్రసారాల నాణ్యత లోపభూయిష్టంగా ఉంటుంది. వీటికి చెక్ పెట్టేలా బ్రాడ్‌కాస్ట్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయంతీసుకుంది. 
 
ఇందులోభాగంగా, మొబైల్ పోర్టబులిటీ తరహాలోనే సెటాప్‌బాక్స్‌ల పోర్టబులిటీని అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. దీనికి కస్టమర్లు ఎలాంటి ఖర్చూ చేయనక్కర్లేదు. ప్రస్తుతం తమ వద్ద ఉండే పాత డీటీహెచ్/కేబుల్ ఆపరేటర్ సెటాప్‌బాక్స్‌ను అలాగే ఉంచేసుకుని కొత్త కంపెనీ ప్లాన్‌లోకి మారిపోవచ్చు. బ్రాడ్‌కాస్ట్ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లాది మంది కస్టమర్లు తమ సర్వీస్‌లను మార్చుకునే అవకాశం ఉంది. 
 
అయితే, ట్రాయ్ నిర్ణయాన్ని డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ సర్వీస్ ప్రొవైడర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్ ఆపరబులిటీని అమల్లోకి తీసుకునిరావడం చాలా కష్టతరమని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెటాప్‌ బాక్స్ ఎన్‌క్రిప్టెడ్‌ను బ్రేక్ చేస్త ప్రైవసీ‌పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని వారు చెబుతున్నారు. అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఈ యేడాది ఆఖరు నాటికి సెటాప్‌బాక్స్‌ల పోర్టబులిటీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 రోజుల క్రితం విధుల్లో చేరిన యువ వైద్యుడు.. ప్రియురాలు నో చెప్పిందనీ...