Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#VarmaaTrailer తెలుగు అర్జున్‌ రెడ్డిలా హిట్ అవుతుందా? (video)

Advertiesment
#VarmaaTrailer తెలుగు అర్జున్‌ రెడ్డిలా హిట్ అవుతుందా? (video)
, బుధవారం, 9 జనవరి 2019 (18:53 IST)
తెలుగులో బంపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో వర్మగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజైనా అంతగా రెస్పాన్స్ రాలేదు. అయితే తమిళ అర్జున్ రెడ్డి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ నెట్టింట దుమ్మురేపుతోంది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన ఈ సినిమా.. తమిళంలో వర్మగా బాల రీమేక్ చేస్తున్నారు. 
 
తమిళ రీమేక్ లో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా చేస్తున్నాడు. బాలా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, సూర్య చేతుల మీదుగా తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. వర్మ జీవితంలోని వివిధ కోణాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. 
 
ఈ సినిమా ధృవ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఇంకా అర్జున్ రెడ్డి తరహాలో వర్మ కూడా యువతకు బాగా కనెక్ట్ అవుతాడని సినీ జనం అనుకుంటున్నారు. ఇంకేముంది.. తమిళ అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ ట్రైలర్‌ను ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యామీనన్ ''ప్రాణ'' ప్రయోగమే.. మహానాయకుడు, యాత్రకు మధ్య?