Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముస్లింలను రాజకీయ పార్టీలు కండోమ్స్‌లా వాడుకుంటున్నాయ్: అబూ అజ్మీ

సమాజ్‌వాదీ పార్టీ యువనేత, మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్‌ ఆజ్మీ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పలు రాజకీయ పార్టీలు ముస్లింను కండోమ్స్‌లా వాడుకుంటున్నాయన

Advertiesment
Political parties
, శుక్రవారం, 27 జనవరి 2017 (09:00 IST)
సమాజ్‌వాదీ పార్టీ యువనేత, మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్‌ ఆజ్మీ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పలు రాజకీయ పార్టీలు ముస్లింను కండోమ్స్‌లా వాడుకుంటున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలో జరగనున్న బీఎంసీ ఎన్నికల ప్రచార సభకు తన తండ్రితో కలిసి హాజరైన సందర్భంగా ఫర్హాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
కండోమ్‌లతో పోల్చడం ద్వారా మొత్తం ముస్లిం జాతిని ఫర్హాన్‌ అవమానపరిచారని ముంబై బీజేపీ అధ్యక్షుడు హైదర్‌ ఆజం మండిపడుతున్నారు. మరోవైపు ఫర్హాన్‌ వ్యాఖ్యలు సమాజ్‌వాదీ పార్టీ వైఖరిని బట్టబయలు చేశాయని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్‌ పఠాన్‌ అన్నారు. అయితే ఫర్హాన్‌ మాత్రం ముస్లింల దురవస్థను ఎత్తిచూపేందుకు ఉదాహరణగా మాత్రమే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. 
 
అయితే ఆజ్మీ వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింల‌ను కండోముల‌తో పోల్చ‌డం ద్వారా మొత్తం ముస్లిం మ‌తాన్నే అవ‌మానించారంటూ ముస్లిం సంఘాలు ఫైర్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం పగ్గాలు చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా: శశికళ