Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం పగ్గాలు చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా: శశికళ

చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనడానికి అన్నాడీఎంకే చీఫ్ చిన్నమ్మ శశికళ బంధువర్గానికి వీవీఐపీ పాస్‌లు

సీఎం పగ్గాలు చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా: శశికళ
, శుక్రవారం, 27 జనవరి 2017 (08:53 IST)
చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనడానికి అన్నాడీఎంకే చీఫ్ చిన్నమ్మ శశికళ బంధువర్గానికి వీవీఐపీ పాస్‌లు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. శశికళ ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎంగా పదవిని చేపట్టిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని, అప్పటి వరకూ ఆ వంక రాబోనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ నేతలకు తేల్చి చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అసెంబ్లీకి వస్తారని, వీఐపీ గ్యాలరీలో ఆశీనులై సమావేశాలను తిలకిస్తారని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా పార్టీ శాసనసభ్యులంతా భావించారు. కానీ సీన్ మారింది.
 
ఎందుకని ఆరా తీస్తే.. సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతాననని, అప్పటి వరకూ అటువైపు చూడనని శశికళ సీనియర్‌ మంత్రులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. జయలలిత బాటలోనే తాను పయనించాలని ఆమె తీర్మానించుకున్నారని, ఆ మేరకే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు, గురువారం జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకలకు దూరంగా వున్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వొంగమంటే పొర్లుదండాలు పెట్టే బాపతు అంటే వీరే..