Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Advertiesment
yogi adityanath

ఠాగూర్

, ఆదివారం, 19 మే 2024 (12:27 IST)
భారత్ తీసుకున్న చర్యల కారణంగానే పాకిస్థాన్‌ భిక్షాటన చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా తాను ప్రధానమంత్రిగా మూడోసారి భాగస్వామ్యం అయిన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇపుడు పాకిస్థాన్‌కు పీవోకేను రక్షించుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. 
 
శనివారం మహారాష్ట్రలోని పాల్టర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు కాపాడుకోవడం పాకిస్థాన్‌కు సంక్లిష్టంగా మారింది. మోడీని మూడోసారి ప్రధాని కానివ్వండి. ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో భాగమవుతుంది. ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 
 
కాగా పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఈ మధ్య పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు, పాకిస్థాన్ దళాల మధ్య కూడా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో పాకిస్థాన్ పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందనే విశ్లేషణలు మరోసారి ఊపందుకున్న విషయం తెలిసిందే.
 
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నక్సలిజం, ఉగ్రవాదం అణచివేతకు దృఢమైన వైఖరితో ఉందని, ఈ మేరకు గత 10 ఏళ్లలో కొత్త భారత్ను చూశామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశ సరిహద్దులకు భద్రత కల్పించామని, ఉగ్రవాదం, నక్సలిజం అరికట్టామని అన్నారు. ముంబై పేలుళ్లు జరిగినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారతదేశంలోకి వచ్చారని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!