Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

narendramodi

ఠాగూర్

, శుక్రవారం, 17 మే 2024 (15:17 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ, దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఆ కూటమి ఎన్నికల బరిలో ఉందని మండిపడ్డారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ‌లపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. వారు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆరోపించారు.
 
'శ్రీరామనవమి రోజున రామమందిరంపై ఎస్పీకి చెందిన ఓ సీనియర్‌ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్‌లల్లాను మళ్లీ టెంట్‌లోకి తీసుకొస్తారు' అని మోడీ దుయ్యబట్టారు. 
 
'ఓ వైపు బీజేపీ - ఎన్డీయే కూటమి జాతి ప్రయోజనాలకు జీవితాలను అంకితం చేస్తే.. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు పోటీపడుతోంది. ఈ ఎన్నికల తర్వాత వారి కూటమి పేకమేడలా కూలిపోతుంది. జూన్‌ 4 ఎంతో దూరంలో లేదు. ఈ ఎన్నికల్లో మోడీ సర్కారు హ్యాట్రిక్‌ కొట్టబోతోందని ప్రపంచమంతా తెలుసు' అని విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం