Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలి వేదికగా భేటీకానున్న భారత్ - బ్రిటన్ ప్రధానులు

Advertiesment
modi
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:42 IST)
భారత్, బ్రిటన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, రిషి సునక్‌లు ఒకచోట భేటీకానున్నారు. ఇండోనేషియా రాజధాని బాలిలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. బాలి వేదికగా వచ్చే నెలలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఆ సమయంలో వీరిద్దరూ సమావేశంకానున్నారు. ఇందుకోసం వారిద్దరూ అంగీకరించారు. పైగా, ఈ భేటీపై బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
 
ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్‌లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ఈ ప్రకటనలో తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల అర్థాంతరంగా ఆగిపోయిన మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు తిరిగి కొనసాగించే విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతను పక్కదోవ పట్టిస్తున్న నక్సలిజం : ప్రధాని నరేంద్ర మోడీ