Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్ కొత్త ప్రధాని రిషికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Advertiesment
pmmodi
, మంగళవారం, 25 అక్టోబరు 2022 (09:35 IST)
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి రిషి సునక్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలతో పాటు తన అభినందనలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 2030 రోడ్ మ్యాచ్ అమలు, ప్రపంచ సమస్యలపై కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. 
 
భారత్, బ్రిటన్ మధ్య చారిత్రక సంబంధాలు ఇకపై ఆధునికతరం భాగస్వామ్యంలోకి అడుగుపెడుతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయ పౌరులకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటన్‌లోని భారతీయులు ఇరు దేశాల మధ్య మానవవారధి లాంటివారని అభివర్ణించారు. 
 
పంజాబ్ టు బ్రిటన్... రిషి సునక్ ప్రస్థానం... 
 
బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునక్ ఆ దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దీంతో ఆయన ఈ నెల 28న తేదీన బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో బ్రిటన్ రాజు చార్లెస్-2 ప్రమాణం చేయిస్తారు. 
 
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల సంవత్సరాల పాటు భారత్‌లో బ్రిటన్ వలస పాలన సాగించింది. కానీ, ఈనాడు అదే వలస పాలన దేశమైన భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండటం గమనార్హం. 
 
రిషి సునక్ పూర్వీకులది పంజాబ్. 1980 మే 12వ తేదీన బ్రిటన్‌లోని సాథాంఫ్టన్‌లో రిషి సునక్ జన్మించారు. స్టాన్‌ఫర్ట్ యూనివర్శిటీలో ఎంబీఏ పట్టం అందుకున్నారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమీ కోర్సుల్లో డిగ్రీపట్టాలు సాధించారు. 2001-04 మధ్య గోల్డ్‌మాన్ సాక్‌లో విశ్లేషకుడుగా సేవలు అందించారు. రెండు హెడ్జ్ కంపెనీల్లో పని చేశారు.
 
నారాయణ మూర్తి అల్లుడే రిషి... 
ప్రపచం అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడే ఈ రిషి సునక్. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని రిషి సునక్ వివాహం చేసుకున్నారు. రిషి - అక్షత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిషి సునక్ తొలిసారి 2014లో రిచ్‌మండ్ నుంచి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. బ్రిటన్ దేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి సునక్ పేరు ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక కావడం అతి గొప్ప గౌవరం : రిషి సునక్