Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిషి సునక్‌కు దారి చూపిన బోరిస్ జాన్సన్ రాజీనామా....

Advertiesment
Rishi Sunak
, మంగళవారం, 25 అక్టోబరు 2022 (08:57 IST)
బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రిషి సునక్ వెలుగులోకి వచ్చారు. ప్రధానమంత్రి పదవికి తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, తన వెన్నంటే ఉంటూ తనకు వెన్నుపోటు పొడిచాడన్న అనుమానంతో రిషి సునక్‌ను బోరిస్ జాన్సన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తన రాజీనామాతో జరిగిన ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసిన లిజ్ ట్రస్‌కు మద్దతు పలికారు. 
 
నిజానికి తొలి దశలో అనేక మంది అధికార పార్టీ ఎంపీలు మద్దతు తెలిపినప్పటికీ తర్వాతి దశల్లో తగ్గుముఖం పట్టింది. మెజారిటీ అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎఁపీలు రిషి సునక్‌కు మద్దతు ఇచ్చినా పార్టీ సభ్యులు మాత్రం లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా, సంపన్నులపై పన్నుల్లో కోత విధిస్తామని లిజ్ ట్రస్ చేసిన వాగ్ధానం ప్రతి ఒక్కరికీ ఆకర్షించింది. చివరకు అదే ఆమె పదవిని త్యజించేలా చేసింది. 
 
ఆమె సారథ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ దేశంలో పరిస్థితులు ఆర్థిక సంక్షోభం దిశగా పయనించాయి. దీనికితోడు కరోనా తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ద్రవ్యోల్బణం ఘాటు నషాళానికి ఎక్కింది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గిస్తామని లిజ్ ట్రస్ చేసిన ప్రకటన వికటించింది. 
 
పైగా, మనీ బడ్జెట్‌ రూపకల్పనలో అవకతవకలు ఉండటంతో ఆర్థిక మంత్రిని తప్పించారు. తర్వాత బ్రిటన్ సెంట్రల్ బ్యాంకు ఛాన్సలర్‌ను ఆర్థిక మంత్రిని చేస్తామని హమీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ఆమె 45 రోజులకే ప్రధానమంత్రి కుర్చీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత బోరిస్ జాన్సన్ రాజీనామా, ఆ తర్వాత లిజ్ ట్రస్ తప్పుడు ఆర్థిక విధానాలు రిషి సునక్‌ను ప్రధాని పీఠానికి మరింత చేరువ చేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ టు బ్రిటన్... రిషి సునక్ ప్రస్థానం...