ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లనున్నారు. భూటాన్ ప్రధాని లొటయ్ త్సెరింగ్ ఆహ్వానంతో మోడీ అక్కడికి వెళ్లనున్నారు.
ఈ నెల 17నుంచి రెండు రోజులు భూటాన్ లో పర్యటించినున్నారు. భూటాన్‌తో స్నేహానికి భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం ప్రతిబింబించేలా ప్రధాని పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యంగ అన్న తన విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మోడీ భూటాన్ వెళ్లనున్నారు.
ప్రధాని మోడి… భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్చుక్, మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో పాటు భూటాన్ ప్రధాని త్సెరంగ్‌తో సమావేశమైన చర్చలు జరపనున్నారు.