Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ స్కూటీ నందిగ్రామ్‌లోనే పడిపోవాలని రాసిపెట్టివుంటే ఏం చేయను.. మోడీ

Advertiesment
మీ స్కూటీ నందిగ్రామ్‌లోనే పడిపోవాలని రాసిపెట్టివుంటే ఏం చేయను.. మోడీ
, ఆదివారం, 7 మార్చి 2021 (17:51 IST)
దేశంలో ఐదు రాష్ట్రాలకు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రం కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కమలనాథులు కలలుగంటున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలు పదేపదే పర్యటిస్తున్నారు. ఆదివారం కూడా ప్రధాని మోడీ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. 
 
ప్రజలు ఓ అక్కగా నమ్మి మీకు ఓటేస్తే మీరు మీ మేనల్లుడికి అత్తలా వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ బెంగాల్ ప్రజల్ని మోసగించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మమతా బెనర్జీ ఓ స్కూటీ నడిపిన అంశాన్ని ప్రస్తావించారు.
 
"కొన్నిరోజుల కిందట మీరు రోడ్డుపై స్కూటీ నడిపారు. మీరు స్కూటీ నడుపుతూ కిందపడి దెబ్బలు తగిలించుకోకూడదని ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. అయితే మీరు కిందపడకుండా స్కూటీ నడపడం బాగుంది కానీ, ఆ స్కూటీ తయారైన రాష్ట్రాన్ని శత్రువుగా భావిస్తున్నారు.
 
పైగా, మీ స్కూటీ భవానీపూర్ వెళుతుందని భావిస్తే నందిగ్రామ్ వైపు మలుపు తీసుకుంది. దీదీ... నేను ప్రతి ఒక్కరూ బాగుండాలనే కోరుకుంటాను, ఎవరూ నాశనమవ్వాలని కోరుకోను. కానీ మీ స్కూటీ నందిగ్రామ్‌లోనే పడిపోవాలని రాసిపెట్టి ఉంటే నేనేం చేయగలను?" అని వ్యంగ్యం ప్రదర్శించారు.
 
కాగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. మమతాకు వ్యతిరేకంగా బీజేపీ తరపునన సువేందు అధికారి బరిలో ఉన్నారు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన మాజీ నేత కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలకు శుభవార్త.. ఒక్క రోజు సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్