Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ యవనికపై భారత్ ప్రత్యేక ముద్ర : ప్రధాని మోడీ

pmmodi
, సోమవారం, 15 ఆగస్టు 2022 (09:53 IST)
ప్రపంచ యవనికపై భారత్ ప్రత్యేక ముద్ర వేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోటపై నుంచి ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించారు. 
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్‌ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని, కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ నిలిచి గెలిచిందన్నారు. ఆకలికేకల భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని గుర్తు చేశారు. వైజ్ఞానిక రంగంలో ఇండియా తన ముద్ర వేస్తున్నదని చెప్పారు. 
 
భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిందని చెప్పిన ఆయన ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శిగా నిలిచిందని స్పష్టం చేశారు. మహాత్మునికి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందన్నారు. దేశప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని గుర్తుచేశారు. 
 
భారత ప్రజానీకం నవచేతనతో మందడుగు వేస్తున్నది. వచ్చే 25 ఏండ్లు పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు. సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని వదిలేయాని సూచించారు. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బానిస సంకెళ్ళ ఛేదనలో వారి పోరాటం అనుపమానం : ప్రధాని