Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోడీ ఆవిష్కరించి పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ల ఫీచర్లేంటి?

param rudra

ఠాగూర్

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (08:32 IST)
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ విధానం కింద దేశీయంగా అభివృద్ధి చేసిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఆవిష్కరించారు. ఈ కంప్యూటర్ల విలువ సుమారుగా రూ.130 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పూణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు ఈ సూపర్ కంప్యూటర్లను వినియోగించనున్నారు. 
 
ప్రధాని మోడీ ప్రారభించిన మూడు సూపర్ కంప్యూటర్లు ఫిజిక్స్ నుంచి ఎర్త్ సైన్స్, కాస్మోలజీ వరకు అధునాతన పరిశోధనలు చేయడానికి దోహదపడతాయి. నేటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచం కీలకమైన ఈ రంగాలనే భవిష్యత్తు ప్రపంచంగా భావిస్తుంది. ఈ డిజిటల్ విప్లవాల యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి పర్యాయపదంగా మారుతోంది. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ప్రత్యక్షంగా ఆధారపడని రంగమంటూ ఏదీ లేదు. ఇది భారతదేశ విజయానికి అతిపెద్ద ఆధారం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 
 
అయితే, ఈ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్స ప్రత్యేకతలను పరిశీలిస్తే, 
పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు అత్యంత సంక్లిష్ట గణనలను ఎంతో వేగంతో నిర్వహించగలవు. 
వాతావరణ సూచన, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పరిశోధన కోసం వీటిని ఉపయోగిస్తారు.
పరిశోధకులకు సవాలుగా మారుతున్న సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యమైన ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన గణన సాధనాలను ఈ సూపర్ కంప్యూటర్లు అందిస్తాయి. 
జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్డీ), సూపర్ కంప్యూటర్ ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (ఎస్ఆర్టీ), ఇతర ఖగోళ దృగ్విషయాలను శోధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి రావడంతో మెటీరియల్ సైన్స్, అటమిక్ ఫిజిక్స్ వంటి రంగాలలో పరిశోధనలు మెరుగుతాయి.
ఎస్ఎన్ బోస్ సెంటర్ సూపర్ కంప్యూటర్ ఫిజిక్స్, కాస్మోలజీ, ఎర్త్ సైన్స్ వంటి రంగాలలో అధువాతన పరిశోధవలను నిర్వహించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్లంటే ఆయనకు లెక్కలేదు.. పదవులు కాదు.. విలువలు ముఖ్యం : బాలినేని (Video)