Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష
, ఆదివారం, 13 మార్చి 2022 (14:22 IST)
దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ భద్రత, సర్వసన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో అంతర్జాతీయంగా ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ప్రధాని అత్యున్నత స్థాయి భద్రత సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాగ మంత్రి జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. 
 
ఇదిలావుంటే, ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి ఎలా ప్రయోగించారన్న అంశంపై సమీక్షలో చర్చకు వచ్చారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం