Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 రోజులుగా ఆస్పత్రిలో జయలలిత.. ''అమ్మ'' మాట్లాడిన వీడియో వైరల్..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై బుధవారం నాటికి నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

Advertiesment
PIL in Madras HC seeks report on Jayalalithaa's health condition
, బుధవారం, 5 అక్టోబరు 2016 (12:07 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై బుధవారం నాటికి నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆమెకు చికిత్స కొనసాగుతోందని అపోలో ఆస్పత్రి వెల్లడించింది. అటు-జయలలిత హెల్త్‌పై బుధవారం పూర్తి స్పష్టత ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం కూడా తెలిపింది. అమ్మ ఆరోగ్యం మరింత మెరుగు పడుతోందని తెలిసి ఏఐఎడీఎంకె శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
 
చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్న ‘అమ్మ’ మాట్లాడారంటూ ఒక ఆడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పేందుకు ఈ ఆడియోనే సాక్ష్యం అంటూ అన్నాడీఎంకే అభిమానులు చెబుతున్నారు. వాట్సప్‌లో దీనికి సంబంధించిన ఆడియో ఫైలు విపరీతంగా షేర్ అవుతోంది. 
 
అందులో జయలలిత మాట్లాడినట్లుగా చెబుతున్నా.. నిజానికి ఇది అమ్మగొంతులా అనిపించడం లేదని కొందరి అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆస్పత్రిలో బెడ్ మీద ఉండి మాట్లాడ‌డం వ‌ల్ల గొంతు కొంచెం మారి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 మంది ఉగ్రవాదులతో పాక్ రెడీ ఉంది.. ఎందుకో తెలుసా?