Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీ హత్యకు కుట్ర... ఇద్దరు రెడీగా వున్నారు... నువ్వు కూడా ఓకే అంటే...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో సోనీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా వాసి సోని అనే వ్యక్తికి పాకిస్థాన్‌కు చెందిన ఓ

Advertiesment
PM Modi
, సోమవారం, 22 మే 2017 (19:17 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో సోనీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా వాసి సోని అనే వ్యక్తికి పాకిస్థాన్‌కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్లో ఆగంతుకుడు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ముంబై ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆయనను హతమార్చేందుకు తమతో చేయి కలపాలంటూ అతడు చెప్పాడు. 
 
ఇలా తమతో కలిసి నడిస్తే రూ.50 కోట్లు ఇస్తామని కూడా వెల్లడించాడు. ఇప్పటికీ మోదీని చంపేందుకు ఇద్దరు రెడీగా వున్నారనీ, నీవు కూడా సహకరిస్తే మొత్తం ముగ్గురు కలిసి ప్రణాళికను అమలుపరచాలనుకుంటున్నట్లు అతడు తెలిపాడు. 
 
ఐతే అతడు ఆ కాల్ ను మొదట్లో సీరియస్‌గా తీసుకోలేదు కానీ ప్రధానమంత్రిని హత్య చేయాలంటూ అతడు చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ కాల్ పైన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఆ రోజు 79651219 అనే నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హత్యా రాజకీయాలంటే నాకు అసహ్యం: డిప్యూటీ సీఎం కేఈ