Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హత్యా రాజకీయాలంటే నాకు అసహ్యం: డిప్యూటీ సీఎం కేఈ

హత్యా రాజకీయాలు ప్రోత్సహించే సంస్కృతి తనది కాదన్నారు డిప్యూటీ సి.ఎం కే.ఈ క్రిష్ణమూర్తి. నారాయణరెడ్డికి చాలామంది శత్రువులు ఉన్నారని, ఆయన్ని ఎవరు హత్య చేశారో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. నారాయణ రెడ్డి హత్

హత్యా రాజకీయాలంటే నాకు అసహ్యం: డిప్యూటీ సీఎం కేఈ
, సోమవారం, 22 మే 2017 (18:29 IST)
హత్యా రాజకీయాలు ప్రోత్సహించే సంస్కృతి తనది కాదన్నారు డిప్యూటీ సి.ఎం కే.ఈ క్రిష్ణమూర్తి. నారాయణరెడ్డికి చాలామంది శత్రువులు ఉన్నారని, ఆయన్ని ఎవరు హత్య చేశారో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి వస్తున్న ఆరోపణల ఖండిస్తూ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పత్రికా సమావేశం నిర్వహించారు. నారాయణరెడ్డి తనకు సమవుజ్జీయే కాదని, ఒకరిని హత్య చేసి రాజకీయం చేయాల్సిన పనిలేదన్నారు. 
 
ప్రజలు తనపై నమ్మకం వుంచి ఒకసారి ఎంపీ, 6 సార్లు ఎమెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా, బి.సిల నాయకుడిగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. తాను మొదట నుంచి అభివృద్ధి రాజకీయాలనే నమ్ముకున్నానని చెప్పారు.
 
ప్రతిపక్ష నాయకుడు ఊహాజనితమైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జరిగిన హత్యకు సంబంధించి తనకు గానీ, తన కుమారుడు శ్యాంబాబుకు కానీ ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సి.ఎం తెలిపారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, ప్రతిపక్ష పార్టీ నాయకుడు కావాలని నా మీద  బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనికి సంబంధించి విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. 
 
తన కుమారుడు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత పత్తికొండ ప్రాంతంలో ప్రజలు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు వెళ్లకుండా వారికి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో హంద్రీనీవా నీటిని ఉపయోగించుకొని, పత్తికొండ ప్రాంతంలో 100 చెరువులు నింపడం ద్వారా ప్రజలకు త్రాగు మరియు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్నాక్రై రాన్సమ్‌వేర్ తరహాలో ఇటర్నల్ రాక్స్ వచ్చేస్తోంది.. అడ్డుకోవడం కష్టమట..!