Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్నాక్రై రాన్సమ్‌వేర్ తరహాలో ఇటర్నల్ రాక్స్ వచ్చేస్తోంది.. అడ్డుకోవడం కష్టమట..!

ప్రపంచ దేశాలను వణికించిన వన్నా క్రై రాన్సమ్‌వేర్ కథ గురించి తెలిసిందే. పది రోజుల పాటు భారత దేశంతో పాటు దాదాపు 150కి పైబడిన దేశాల మీద సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడులకు రాన్సమ్‌వేర్ కారణమైంది. రాన్సమ్ వేర

వన్నాక్రై రాన్సమ్‌వేర్ తరహాలో ఇటర్నల్ రాక్స్ వచ్చేస్తోంది.. అడ్డుకోవడం కష్టమట..!
, సోమవారం, 22 మే 2017 (18:24 IST)
ప్రపంచ దేశాలను వణికించిన వన్నా క్రై రాన్సమ్‌వేర్ కథ గురించి తెలిసిందే. పది రోజుల పాటు భారత దేశంతో పాటు దాదాపు 150కి పైబడిన దేశాల మీద సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడులకు రాన్సమ్‌వేర్ కారణమైంది. రాన్సమ్ వేర్ దాదాపు 2.40 లక్షల కంప్యూటర్లకు వ్యాపించింది. విండోస్ 7 అప్‌డేటెడ్ వెర్షన్లున్న కంప్యూటర్లకే ఇది అంటుకుంటుంది. 
 
రాన్సమ్ వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించిందంటే మొత్తం ఫైళ్లన్నీ ఎన్ క్రిప్ట్ అవుతాయి. దీంతో వాటిని అన్ లాక్ చేయడానికి వాళ్లు చెప్పిన మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వన్నా క్రై కంటే బలమైనదొకటి రాబోతోంది. ఇటర్నల్ రాక్స్ అనే పేరిట వచ్చే దీనిని అడ్డుకునే వీలుండదని అంటున్నారు. ఇటర్నల్ రాక్స్ మాల్ వేర్‌ను ఎదుర్కోవడం కష్టమని.. ఇది ఇంటర్నల్ బ్లూ అనే ఎన్ఎస్ఏ టూల్‌ను ఉపయోగించుకుని ఒక కంప్యూటర్ నుంచి మరోదానికి విండోస్ ద్వారా వ్యాపిస్తుందని ఐటీ నిపుణులు అంటున్నారు.
 
ప్రస్తుతానికైతే ఇటర్నల్ రాక్స్‌లో ఎలాంటి ప్రమాదకరమైన అంశాలు లేవని.. అది ఫైళ్లను లాక్ చేయడం లేదా కరప్ట్ చేయడం లాంటివి జరగడం లేదని చెప్తున్నారు. కానీ ఇటర్నల్ బ్లూ మాత్రం ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్‌ను ఉపయోగించుకుని రిమోట్ కమాండ్ల ద్వారా ఇతర కంప్యూటర్లను కూడా ఏ సమయంలోనైనా నాశనం చేస్తుందని ఐటీ నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెసిఆర్ ఇలా చేస్తాడనుకోలేదు... ఏం చేశాడు...?!