Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా విజృంభణ.. ముసలివాళ్లు అన్నాక చావక తప్పదు.. ఎవరు..?

Advertiesment
కరోనా విజృంభణ.. ముసలివాళ్లు అన్నాక చావక తప్పదు.. ఎవరు..?
, శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (16:11 IST)
మన దేశంలో కరోనా విజృంభణ దారుణంగా ఉంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపుతున్నాయి. 
 
అయితే ఈ తరుణంలో మధ్యప్రదేశ్ మంత్రి ప్రేమ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులన్నాక, మూసలివాళ్ళు అవుతారని, ఆ తర్వాత చనిపోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో చోటు చేసుచేసుకుంటున్న కరోనా మరణాలపై అడిగిన ప్రశ్నకు.. మంత్రి ఈ విధంగా స్పందించారు. 
 
"మరణాలు సంభవించాయని నేను ఒప్పుకుంటున్నాను. వాటిని ఎవరు ఆపలేరు, ప్రజలు మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనాను ఎదురుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మనుషులన్నాక, ముసలివాళ్ళు అవుతారు, ఆ తర్వాత చనిపోవాల్సిందే " అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ప్రేమ సింగ్ పటేల్. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుంభ్, కరోనా: దేవుడిపైనే భారమని భక్తులు అంటున్నారు, మరి, హరిద్వార్‌‌లో స్థానికులు ఏమంటున్నారు?