Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్.. ఆమ్నెస్టీ

Advertiesment
Pegasusus
, శుక్రవారం, 29 డిశెంబరు 2023 (22:32 IST)
భారతదేశంలోని ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్ ఉందని ఆపిల్ కంపెనీ కొన్ని నెలల క్రితం తన వినియోగదారులకు హెచ్చరిక సందేశాన్ని పంపిన విషయం తెలిసిందే. దాంతో విపక్షాలు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెగాసస్ సమస్యపై ఉభయ సభలు దద్ధరిల్లిపోయాయి.
 
తాజాగా ఇదే అంశంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన విషయాలను వెల్లడించింది. భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది.
 
యాపిల్ కంపెనీ నుంచి అలర్ట్ అందడంతో "ది వైర్" మ్యాగజైన్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, మరో జర్నలిస్టు తమ ఫోన్‌లలో పెగాసస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న సైబర్ ల్యాబ్‌కు ఫోన్‌లు ఇచ్చారు. ఈ రెండు ఫోన్లను తమ ల్యాబ్‌లో పరీక్షించగా వాటిలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉన్నట్లు తేలిందని ఆమ్నెస్టీ ఇటీవల వివరించింది.
 
పెగాసస్ స్నూపింగ్ కాకుండా ఫోన్‌లలో సమాచారాన్ని సేకరించే సాఫ్ట్‌వేర్‌గా పేరుగాంచింది. సాధారణ పరిస్థితుల్లో ఎవరూ తమ ఫోన్‌లలో ఈ సాఫ్ట్‌వేర్ ఉనికిని గుర్తించలేరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలిలో ఊగిసలాడిన విమానం.. ల్యాండింగ్ సమయంలో.. వీడియో వైరల్