Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాట్నా రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలు.. పోర్న్ సైట్ల వీక్షణలో టాప్ ప్లేస్

స్మార్ట్ ఫోన్‌ వాడకం పెరిగిన దగ్గరి నుంచి రకరకాల ఆఫర్లతో వివిధ రకాల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో విమానాశ్రయాలు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో వినియోగదారులను ఆకర్షించ

Advertiesment
Patna
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:28 IST)
స్మార్ట్ ఫోన్‌ వాడకం పెరిగిన దగ్గరి నుంచి రకరకాల ఆఫర్లతో వివిధ రకాల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.  దీంతో విమానాశ్రయాలు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్రీ వైఫై అంటూ రకరకాల ఆఫర్లు దర్శనమిస్తున్నాయి. ఉచితంగా నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చని ఉచిత వైఫై సేవలకు జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక ముఖ్యంగా భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం ఉచితంగా అందిస్తున్న వైఫై సేవల ఉపయోగంలో బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్ దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
 
అయితే ఫ్రీ వైఫై సేవలను ప్రయాణికులు ఎందుకోసం వినియోగించుకుంటున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. గత నెల నుంచి అందుబాటులోకి వచ్చిన వైఫై సేవలను ఎక్కువమంది ప్రయాణికులు పోర్న్ సైట్‌లు చూడడానికి, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికే పూర్తిగా ఉపయోగించుకుంటున్నారట. ఈ విషయంలో పాట్నా స్టేషన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా పోర్న్ సైట్లను వెతకడానికే ఇంటర్నెట్‌ని వాడుతున్నట్లు రైల్ టెల్ ప్రతినిధి వెల్లడించారు. 
 
పాట్నా తర్వాత ఇంటర్నెట్‌ను సెర్చ్ చేస్తున్న స్టేషన్లలో జైపూర్ రెండోస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, న్యూఢిల్లీలు నిలిచాయి. ప్రయాణికులు, ముఖ్యంగా యువత ఉచిత ఇంటర్నెట్ కోసమే పాట్నా స్టేషన్లకు రావడంతో నెట్ స్పీడు తగ్గిపోతోంది. అందుకే దాన్ని పెంచాలని రైల్ టెల్ భావిస్తోంది. ఏపీలోని విశాఖపట్నం, పట్నా, రాంచీ సహా దేశంలోని 23 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అమల్లో వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క దెబ్బతో మన సైన్యం సత్తా - సామర్థ్యం గురించి తెలిసి వచ్చింది : నరేంద్ర మోడీ