Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుజరాత్‌లో హర్దిక్ పటేల్ రాసలీలల సీడీ హల్‌చల్.. (వీడియో)

రాష్ట్ర ఎన్నికల ముందు పటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌ రాసలీలల సీడీ క్లిప్పింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీడీలో ఉన్నది హార్దిక్‌ పటేలేనని మాజీ అనుచరుడు అశ్విన్‌ అన్నారు. సీడీలో ఉన్నది తాను కానని హార

Advertiesment
గుజరాత్‌లో హర్దిక్ పటేల్ రాసలీలల సీడీ హల్‌చల్.. (వీడియో)
, బుధవారం, 15 నవంబరు 2017 (10:58 IST)
రాష్ట్ర ఎన్నికల ముందు పటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌ రాసలీలల సీడీ క్లిప్పింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీడీలో ఉన్నది హార్దిక్‌ పటేలేనని మాజీ అనుచరుడు అశ్విన్‌ అన్నారు. సీడీలో ఉన్నది తాను కానని హార్దిక్‌ పటేల్‌ వాదిస్తున్నారు. తనపై బురద చల్లేందుకు బీజేపీ నీచ రాజకీయాలకు తెరదీసిందని ఆరోపిస్తున్నారు. ఈ సీడీ వ్యవహారంలో దళిత యువనేత జిగ్నేష్‌ మేవాని హార్దిక్‌ పటేల్‌కు అండగా నిలిచారు. శృంగారం అనేది ప్రాథమిక హక్కని... దానికి భంగం కలిగించే హక్కు ఎవరికి లేదు, పైగా, ఈ విషయంలో సిగ్గు పడాల్సింది లేదు అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఓ వీడియోలో హార్దిక్‌ పటేల్‌ తన సహచరులతో పాటు ఓ మహిళ కూడా కనిపిస్తోంది. సోమవారం కూడా మరో వీడియో వెలుగు చూసింది. ఇందులో ఓ మహిళతో హార్దిక్‌ పటేల్‌ ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియో వ్యవహారంపై దళిత యువ నేత జిగ్నేశ్‌ మెవానీ స్పందించారు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని హర్దిక్‌ పటేల్‌కు మద్దతుగా నిలిచారు. 
 
''హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు'' అని జిగ్నేష్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేంకాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్‌ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్‌ సలహా ఇస్తున్నారు.
 
కాగా, ఈ వీడియో క్లిప్‌ను ఒకప్పుడు హార్దిక్‌కు సహచరుడిగా ఉన్న అశ్విన్‌ బయటపెట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో విషయంలో తనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అశ్విన్ సంకడ్‌ సరియా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కనివారే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వీడియోలో ఉన్నది హార్దిక్‌ పటేలా... కాదా... అన్నది తేల్చాలన్నారు. ఈ సిడిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపాలని డిమాండ్‌ చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సీఎం కావాలని యువకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి...