Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పాస్టర్‌కు 30 పెళ్లిళ్లు... అక్క - చెల్లితో సంబంధం... కొందరిపై అత్యాచారం... ఒకరి హత్య

Advertiesment
Pastor
, గురువారం, 11 అక్టోబరు 2018 (15:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో పాస్టర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళతో పెళ్లి చేసుకోవడం కోర్కె తీరిన తర్వాత విడాకులు ఇవ్వడం. ఇలా ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ బాధితుల్లో అక్కా చెల్లి కూడా ఉన్నారు. అంతేనా తనకు లొంగకుంటే అత్యాచారం చేయడం. ఈ విషయం బయట చెబుతామని బెదిరిస్తే లైంగికదాడికి పాల్పడటం. ఇది ఆ పాస్టర్ మత ప్రచారం ముసుగులో చేస్తున్న పాడుపని. ఇపుడు అతని గుట్టురట్టయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా ఉక్కిరన్‌ కోట ప్రాంతానికి చెందిన పాస్టర్‌ మిలన్‌సింగ్‌ (48) ఊరూరా తిరుగుతూ క్రైస్తవ మత ప్రచారం సాగిస్తున్నాడు. తొలుత తన అత్త కుమార్తె డైసీని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాడు. కొన్ని నెలలకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఇరువురూ విడిపోయారు. 
 
ఆ పిమ్మట సలోమీ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అటుపిమ్మట సలోమీ చెల్లెలు జెన్నిఫర్‌ రాణిని మూడో పెళ్లి చేసుకున్నాడు. జెన్నిఫర్‌ రాణితో కోయంబత్తూరులో కాపురం చేస్తూ తన వద్ద బైబిల్‌ పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన జీవిత అనే యువతిని మాయమాటలతో మోసగించి పెళ్లి చేసుకున్నాడు. 
 
అక్కడ నుంచి జీవితతో కలిసి ఊరూరా తిరుగుతూ మత ప్రచారం చేస్తూవచ్చాడు. ఆ ప్రచార సమయాల్లో మిలన్‌సింగ్‌ పలువురు యువతులపై అత్యాచారాలకు తెగబడ్డాడు. వారిలో కొందరిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఏకంగా 30 మంది యువతులను పెళ్లి చేసుకుని మోసగించాడు. తన బండారాన్ని బయటపెడతానని బెదిరించిన ఓ మహిళను హత్య చేశాడు. 
 
ఈ క్రమంలో ఆ పాస్టర్ ఓ గ్రామంలో మేకలను దొంగతనం చేశాడు. ఈ కేసులో పోలీసులు పాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పాస్టర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఇంతకీ ఈ పాస్టర్ ఓ వికలాంగుడు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు... రేప్ బాధితురాలితో హోం మంత్రి