Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల అపరాధం

indigo flight

వరుణ్

, గురువారం, 18 జనవరి 2024 (11:31 IST)
దేశంలోని ప్రైవేట్ విమాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సంస్థకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ సెక్యూరిటీ తేరుకోలేని షాకిచ్చింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో రన్‌వే పై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భారీ అపరాధం విధించింది. ఇలాంటి చర్యకు పాల్పడిన ఇండిగో సంస్థకు ఏకంగా రూ.1.2 కోట్ల అపరాధం విధించింది. 
 
ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించడం జరిగింది. అక్కడ ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రిపూట డిన్నర్ సమయం కావడంతో రన్‌వేపైనే ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్ వే పై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ముంబై ఎయిర్ పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్ రెడ్డి