హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లో డగ్స్ దందా.. కాలేజీ కుర్రాళ్లే టార్గెట్.. పార్టీ కల్చరే కారణం?
మొన్నటికి మొన్న సుమారు రూ.45కోట్ల విలువైన 231కిలోల డ్రగ్స్‌ను బెంగళూరులో అధికారులు స్వాధీనం చేసుకోవడం పెను కలకలం సృష్టించిన నేపథ్యంలో.. యువతే టార్గెట్‌గా పెను డ్రగ్స్ దందా జరుగుతోందని నార్కోటిక్ అధికా
మొన్నటికి మొన్న సుమారు రూ.45కోట్ల విలువైన 231కిలోల డ్రగ్స్‌ను బెంగళూరులో అధికారులు స్వాధీనం చేసుకోవడం పెను కలకలం సృష్టించిన నేపథ్యంలో.. యువతే టార్గెట్‌గా పెను డ్రగ్స్ దందా జరుగుతోందని నార్కోటిక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల్లో డ్రగ్స్ దందా మూడు ప్యాకెట్స్.. ఆరు సిరంజిలుగా సాగిపోతోంది. ఇందుకు ప్రస్తుత యువత పార్టీ కల్చర్‌కు అలవాటుపడటం కూడా కారణమని నిపుణులు అంటున్నారు.
ఈ మూడు నగరాల్లో జరిగే విందులు, వినోదాల్లో, పార్టీల్లో డ్రగ్స్ వాడకం పెరిగిపోతోందని కేంద్ర నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది. ఈ డ్రగ్స్‌ను మయన్మార్, మలేషియా దేశాల మీదుగా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నట్లు కేంద్ర అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పబ్‌లు, రేవ్ అండ్ వీకెండ్ పార్టీల్లో డ్రగ్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోవడంతో ఫార్మా కంపెనీల ముసుగులో నిషేధిత మత్తుమందుల తయారీ పెచ్చరిల్లిపోతోంది.
శాస్త్రవేత్తలుగా మానవాళికి మేలు చేయాల్సిందిపోయి కొందరు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు. హైదరాబాదులోనూ ఈ దందా కొనసాగుతోందని, ఇందులో బడా వ్యక్తుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీ కుర్రాళ్లు పార్టీ కల్చర్‌కు అలవాటు పడి మజా కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. టూరిజం వీసాతో ప్రధాన నగరాల్లో తిష్ఠవేసిన నైజీరియన్లు వీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.
డ్రగ్స్‌కు బానిసలైనా కాలేజీ విద్యార్థులే డ్రగ్స్ ఏజెంట్లుగా మారిపోతున్నారు. కానీ డ్రగ్స్ నిరోధకానికి సదరు నగరాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆరోపణలు చేస్తున్నారు.