Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్యాకేజీతో బాబు హ్యాపీ... ఇక హోదాతో పనేంటి? బాబు అక్కడ ఏం చెప్పారు? పవన్ ఏం చేస్తారూ...?

గుంటూరు- ప్రపంచం టెక్నాలజీతో ముందుకు పోతుంది... ఏ రోజు ఏ టెక్నాలజీ వస్తుందో అర్థం కావడం లేదు. ఏ రాజకీయనాయకుడైనా, ప్రభుత్వమైనా, కుటుంబమైనా సంస్థ అయినా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే ఫలితాలు సాధించగలుగ

Advertiesment
Chandrababu naidu
, బుధవారం, 5 అక్టోబరు 2016 (13:36 IST)
గుంటూరు- ప్రపంచం టెక్నాలజీతో ముందుకు పోతుంది... ఏ రోజు ఏ టెక్నాలజీ వస్తుందో అర్థం కావడం లేదు. ఏ రాజకీయనాయకుడైనా, ప్రభుత్వమైనా, కుటుంబమైనా సంస్థ అయినా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే ఫలితాలు సాధించగలుగుతారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకత్వ సాధికారత కోసమే పార్టీ కేడర్‌కు శిక్షణనిస్తున్నామని వెల్లడించారు. లీడర్‌షిప్‌ను ఏ విధంగా ఎంపవర్ చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. పార్టీ కేడర్ సరిగ్గా పనిచేస్తేనే క్షేత్ర స్థాయిలో వినూత్న ఫలితాలు సాధించగలుగుతామని పార్టీ కేడర్‌కు చంద్రబాబు నాయుడు దిశానిర్ధేశం చేశారు. దాదాపు రెండుగంటలపాటు పార్టీ జాతీయఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన, ప్రత్యేకహోదా, ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని అంశాలు వంటి  విషయాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రతి అంశం పైన వివరణాత్మకమైన విశ్లేషణను పార్టీకేడర్‌కు చంద్రబాబు తెలియజేశారు. అందులో భాగంగా విభజన గురించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏమన్నారంటే ....
 
విభజన తర్వాత రాష్ట్రం గందరగోళంలో ఉంది. విభజన తర్వాత స్తబ్ధత ఏర్పడింది. ఆ స్తబ్ధత భయంకరమైనది. అందుకే ప్రజలకు భయపడవద్దని మేము భరోసా ఇచ్చాం. అందరం కలిసి కసిగా పనిచేద్దాం. కలిసికట్టుగా పనిచేద్దామని దిశానిర్ధేశం చేశాను. ఎవరికీ అన్యాయం జరగకుండా ఏం చేసినా మాకు ఇష్టమేనని విభజన జరిగే సమయంలో నాడు కేంద్రానికి సూచించాను. విభజన చేయాలంటే ఏపీకి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశాను. విభజన చేయకపోతే తెలంగాణను కన్వీన్స్ చేయండని తెలిపాను. అంతేగానీ  రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టొద్దని చెప్పాను. విభజన తీరు సరిగా లేకుంటే, ఆయా ప్రాంతాల ప్రజలకు విభజన తీరు నచ్చక వారికి అవమానం జరిగితే ప్రజలు ఏ డైరెక్షన్లో పోతారో చెప్పలేమని హెచ్చరించాను. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా ఫేజ్ చేశారని అందులో భాగంగానే పంజాబ్ విభజన ప్రధాని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని తీసుకువచ్చింది.
 
నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి(చంద్రబాబు మాటల్లో)...
ప్రజల ఆమోదం పొందడం, సమర్థవంతమైన నాయకత్వం, విపక్షాలు చేసే విమర్శలు సమర్థవంతంగా తిప్పికొట్టడం, నిరంతరం ప్రజల మధ్య ఉండటం, కార్యకర్తలతో ఉండే విధానం, ప్రజల్లో నమ్మకం వంటి లక్షణాలు నాయకులకుండాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు  దిశానిర్ధేశం చేశారు.  సాధారణ ఎన్నికలే కాదు, ఆ  తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా క్లియర్ కట్ మెజార్టీతో ప్రజలు టీడీపీని గెలిపించారు. గెలిచాక మన బాధ్యత పెరిగింది. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది.   మామూలు రాజకీయ నాయకులకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వారికి కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఉండాలి. అవసరం కూడా అని చంద్రబాబునాయుడు తెలిపారు.  
 
పునర్విభజన చట్టం గురించి  చంద్రబాబునాయుడు ఏమన్నారంటే ....
కేంద్రం పునర్ విభజన చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు పెట్టింది. అందులోభాగంగా విభజన వల్ల ఆంధ్రకు అన్యాయం జరిగింది కాబట్టి ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. అంతేగాక 14వ ఆర్థిక సంఘం వెనుకబడిన ప్రాంతంగా ఏపీని రెఫర్ చేయడం, రాజధానికి ఆర్థిక సాయం, విశాఖకు రైల్వేజోన్, తెలంగాణ, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల్లో ఇండస్ట్రీస్‌కు రాయితీలు ఇస్తామన్నారు. ఏపీలో 12 ఇన్ స్టిట్యూషన్స్ ఇస్తామని చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టును ఎగ్జామిన్ చేస్తామనడం, విజయవాడ, విశాఖ మెట్రో ఎస్టాబ్లిష్ చేస్తామనడం, తిరుపతి, విశాఖ, విజయవాడ నగరాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామన్నారు. 
 
హోదా గురించి ఏమన్నారంటే ......
ప్రత్యేకహోదా, ప్యా కేజీని ఎందుకు సమర్థిస్తున్నామో ఒకసారి మీరు కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని తరుచూ కేంద్రం చెబుతోంది. ప్రత్యేక హోదాకు ఏవైతే ఇస్తున్నామో దానిపై వచ్చే బెనిఫిట్స్ అన్నీ ప్యాకేజీలో ఇస్తామని కేంద్రం పలుసార్లు చెప్పింది. ఇప్పటికే మనం రెండు ఇన్‌స్టిట్యూషన్స్ మినహాయించి అన్నీ సాధించుకున్నాం. అందులో భాగంగా ఇప్పటికే కొన్నింటిలో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి బిల్డింగ్స్ నిర్మించాల్సి ఉంది. మరికొన్నింటిని  ప్రారంభించాల్సి ఉంది. వాటిలో అనంతలో సెంట్రల్, విశాఖలో ట్రైబల్ వర్సిటీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తిచేయాలంటే 10 వేల కోట్లు ఖర్చు, ఆరు సంవత్సరాల టైమ్ పడుతుందని చెప్పారు. హోదాకు సమానంగా ప్యాకేజీ అన్నప్పుడు దాన్ని మనం ఆలోచించాలి అంటూ చెప్పారు. మొత్తమ్మీద ప్రత్యేక హోదాపై ఇక ఆశలు వదులుకున్నట్లేనన్నమాట. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఏకీభవిస్తారో లేదంటే పోరాటం చేస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లోరిడాలో భద్రకాళి, శివంగిల్లా నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు.. సోషల్ మీడియాలో వైరల్..