దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని విమానాశ్రాయంలో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవానుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఈ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న 57 యేళ్ల జవానుకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ అని తేలినట్టు చెప్పారు.
కాగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారందరినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. శనివారం రాత్రి వరకు ఢిల్లీలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.