Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ మృతిపై సీబీఐతో విచారణకు డిమాండ్.. మెరీనాలో ఓపీఎస్ నిరాహార దీక్ష.. జల్లికట్టు తరహాలో?

అమ్మ మృతిపై ఎయిమ్స్ వైద్యులు, ప్రభుత్వం వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన మాత్రం సంతృప్తి చెందలేదు. జయ మృతిపై అనుమానాలు నివృత్తి కావాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని ఓపీఎస్ పట్టుబడుతున్నారు. ఇదే డిమాం

అమ్మ మృతిపై సీబీఐతో విచారణకు డిమాండ్.. మెరీనాలో ఓపీఎస్ నిరాహార దీక్ష.. జల్లికట్టు తరహాలో?
, బుధవారం, 8 మార్చి 2017 (12:17 IST)
చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి తమిళ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరతీసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై వ్యూహాలు రచిస్తున్నారు. ఆదివారం తన నివాసంలో తన మద్దతు ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరాహార దీక్ష చేపట్టాలని డిసైడయ్యారు.

‘అమ్మ’ మృతిపై న్యాయ విచారణ జరపకపోతే ఈనెల 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని గతంలో ఓపీఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఓపీఎస్ హెచ్చరికను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ కొట్టిపడేశారు. దీక్ష ఆయన ఆరోగ్యానికి అంతమంచిది కాదంటూ ఎద్దేవా చేశారు.
 
ఈ నేపథ్యంలో అమ్మ మృతిపై ఎయిమ్స్ వైద్యులు, ప్రభుత్వం వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన మాత్రం సంతృప్తి చెందలేదు. జయ మృతిపై
అనుమానాలు నివృత్తి కావాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని ఓపీఎస్ పట్టుబడుతున్నారు. ఇదే డిమాండుతో బుధవారం ఉదయం ఆయన మెరీనా బీచ్‌లో దీక్షను ప్రారంభించారు. జయ మృతిపై సీబీఐ విచారణ జరిపించేంతవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. 
 
కాగా, పన్నీర్ సెల్వం దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. పలువురు మద్దతుదారులు, ప్రజలు దీక్షాస్థలి వద్దకు చేరుకుంటున్నారు. పన్నీర్‌తో పాటు జయలలిత మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన పలువురు నేతలు, గౌతమి లాంటి నటీమణులు ఆయనతో జతకలిసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం పన్నీర్ సెల్వం దీక్ష ప్రస్తుతం తమిళనాడులో మరో అలజడి రేపే దిశగా సాగుతోంది. మరో జల్లికట్టు ఉద్యమంలా ఓపీఎస్ దీనికి  ఊపిరి పోశారని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మను ఆంటీ అని పిలిచింది.. పళనిస్వామి బదిలీ వేటు వేశారు.. ఆమె ఎవరో తెలుసా?