అమ్మను ఆంటీ అని పిలిచింది.. పళనిస్వామి బదిలీ వేటు వేశారు.. ఆమె ఎవరో తెలుసా?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చాలా సన్నిహితురాలైన.. ఆమెను ఆంటీ అని పిలిచే విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ సబితపై బదిలీ తప్పలేదు. ఎంతమంది ఐఏఎస్ అధికారులను వేరే శాఖలకు బదిలీ చేసినా.. సబిత మాత్రం విద్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చాలా సన్నిహితురాలైన.. ఆమెను ఆంటీ అని పిలిచే విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ సబితపై బదిలీ తప్పలేదు. ఎంతమంది ఐఏఎస్ అధికారులను వేరే శాఖలకు బదిలీ చేసినా.. సబిత మాత్రం విద్యాశాఖ కార్యదర్శిగానే తిరుగులేకుండా.. అమ్మ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆరేళ్ల పాటు ఆమె విద్యాశాఖ కార్యదర్శిగానే కొనసాగారు.
అయితే పళనిస్వామి ప్రభుత్వం కొలువుదీరాక ఎట్టకేలకు ఆమెపై బదిలీ వేటు తప్పలేదు. అయితే ఈ వేటు వెనుక విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్ ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యానాథన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి సబితాను సిమెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శాఖకు బదిలీ చేశారు. సబితపై కాకుండా మొత్తం 17మంది ఐఏఎస్‌లను వేరే శాఖలకు బదిలీ చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే జయలలిత సీఎం కుర్చీలో ఉన్నన్ని రోజులు.. సబిత దర్జాగా ఉన్నారని టాక్. మిగతా అధికారులంతా జయలలితను మేడమ్ అని సంబోధిస్తే.. సబిత మాత్రం 'ఆంటీ' అని పిలిచేవారు. దీన్నిబట్టి జయలలితకు ఆమె వద్ద ఎంత చనువు ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు జయలలిత పాల్గొనే కార్యక్రమాల్లోను సబితా సందడి చేసేవారు. అయితే పళనిస్వామి వచ్చాక సబితపై బదిలీ వేటు వేశారు. ఇలా అమ్మ ఆశయాలను నెరవేరుస్తామని పదవిలో కూర్చున్న పళనిస్వామి చిన్నమ్మ ఆదేశాల మేరకే సబితపై వేటు వేశారని రాజకీయ పండితులు అంటున్నారు.