కేటీఆర్ నాకంటే పదేళ్లు సీనియర్.. ఆయనతో నాకు పోలికా? నారా లోకేష్ ప్రశ్న.. ఆస్తుల వివరాలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎమ్మ
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 6వ తేదీన ఆయన నామినేషన్ వేసినపుడు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో పొందుపరిచిన ఆస్తుల వివరాలు సంగతికి వస్తే తన మీద ఉన్న, తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ పేరు మీద ఉన్న షేర్లు, స్థిర, చర ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
మరోవైపు తనను తెలంగాణ మంత్రి కెటి రామారావుతో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తన కన్నా పదేళ్లు సీనియర్ అని చెబుతూ ఆయనతో తాను ఎలా పోల్చుకుంటానని ప్రశ్నించారు. ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టమని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నానని చెప్పారు.
ఆస్తుల వివరాలు
చరాస్తులు: రూ.273,83,94,996 (హెరిటేజ్ షేర్ల రూపంలో)
స్థిరాస్తులు: రూ.18,00,98,738
వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు: రూ.38,51,09,546
రుణాలు: రూ.6,27,17,417 '
భార్య బ్రాహ్మణి పేరు మీద:
చరాస్తులు: రూ.17,90,60,278
స్థిరాస్తులు: రూ.9,75,80,000
రుణాలు: రూ.21,51,900
కుమారుడు దేవాంశ్ పేరు మీద:
చరాస్తులు: రూ.2,18,55,013
స్థిరాస్తులు: 9,06,89,600