కాశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి పాకిస్థాన్ అత్యున్నత పురస్కారం వరించింది. నిజానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. దీనిపై పోరాటం చేయడంలో గిలానీ విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై పాకిస్థాన్ గుర్రుగా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, పాకిస్థాన్ ఏమనుకున్నదో ఏమోగానీ, ఆయన తమ దేశం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన "నిషాన్ ఈ పాకిస్థాన్"ని ప్రదానం చేయనున్నట్టు ప్రకటించింది.
వాస్తవానికి కొద్ది రోజుల కిందటే హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసినా.... దానిని ఓ ఎజెండాగా మార్చడంలో గిలానీ విఫలమయ్యారంటూ పాక్ అప్పట్లో ఈయనపై గుర్రుగా ఉంది. కానీ... మనసు మార్చుకున్న పాక్ వేర్పాటువాది గిలానీకి ఇప్పుడు పాక్ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది.