ఎడప్పాడికి చెక్.. అమ్మ టీవీ 24x7 త్వరలో ప్రారంభం.. జీ టీవీని ఓపీఎస్ కొనేశారా?
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఛానల్ కొనేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా.. ఇప్పటికే ఓ టీవీ ఛానల్‌ను ఓపీఎస్ కొనేశారని వార్తలు వస్తున్నాయి.
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఛానల్ కొనేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా.. ఇప్పటికే ఓ టీవీ ఛానల్‌ను ఓపీఎస్ కొనేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో అమ్మ టీవీ ఛానల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఓపీఎస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాము కొత్తగా ప్రారంభించే ఛానల్‌కు అమ్మ టీవీ 24x7 న్యూస్ చానల్ అని పేరుపెడుతామని ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గీయులు ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత అమ్మ టీవీ ఛానల్‌కు శ్రీకారం చుడుతామని ఓపీఎస్ వర్గీయులు భావిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడులో ప్రసారం అవుతున్న మడిప్పాకం విశ్వనాథంకు చెందిన జీటీవీని పన్నీర్ వర్గీయులు కొనుగోలు చేశారు. ఈ టీవీకి అమ్మ టీవీగా పేరు మార్చేసి అధికారికంగా ప్రసారం చేసేందుకు ఓపీఎస్ అండ్ టీమ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ టీవీలో శశికళ.. కుటుంబ సభ్యులు అమ్మ జయలలితకు చేసిన ద్రోహాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారని తెలుస్తోంది.