చంద్రబాబుపై పురంధేశ్వరి ఉత్తరాన్ని అమిత్ షా పట్టించుకుంటారా...?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపధ్యంలో ఆయనపై వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు. ముఖ్యంగా వైఎస్సార్సీపి నుంచి జంప్ చేసి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై తెదేపాలో కొంతమంది భగ్గుమ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపధ్యంలో ఆయనపై వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు. ముఖ్యంగా వైఎస్సార్సీపి నుంచి జంప్ చేసి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై తెదేపాలో కొంతమంది భగ్గుమంటున్నారు. బొజ్జల, బోండా ఎమ్మెల్యేలైతే నేరుగా విమర్శలు చేశారు.
మాజీ కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు పురంధేశ్వరి మంత్రివర్గంలోకి వైసీపి ఎమ్మెల్యేలను తీసుకోవడంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ విషయాన్ని భాజపా చీఫ్ అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇస్తే, ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్న మనం చూస్తూ వూరుకుంటే మనం బాబు చేస్తున్న పనులకు మద్దతిస్తున్నట్లే అవుతుందని ఘాటుగా రాశారు. అందువల్ల దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే చంద్రబాబు నాయుడుకి విపక్షాల తీరు ఎలా వున్నా, సొంత పార్టీలోనే ఎమ్మెల్యేల విమర్శలు చేస్తుండటం మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారిని బుజ్జగించేందుకు ఇంచార్జి మంత్రులను రంగంలోకి దింపారు. మరి ఈ వేడి చల్లారుతుందో 2019 నాటికి మరింత రగిలిపోతుందో చూడాలి.