Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

Advertiesment
man dies

ఠాగూర్

, మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (15:50 IST)
కేరళ రాష్ట్రంలో ఇటీవల ఓనం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓనం సెలెబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో 45 యేళ్ల ఉద్యోగి వేదికపై డ్యాన్స్ చేస్తూ వేదికపై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ శాసనసభలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పని చేస్తున్న జునైస్, ఇతర ఉద్యోగులతో కలిసి ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదికపై తోటివారితో కలిసి నృత్యం చేస్తుండగా, ఆయన ఉన్నట్టుండి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహచరులు సమీపంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. వయనాడ్‌కు చెందిన జునైస్, గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్ వద్ద వ్యక్తిగత సహాయకుడుగా కూడా పనిచేశారు. 
 
ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జునైస్ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం, తోటివారు అతడికి సహాయం చేయడానికి పరుగెత్తడం ఆ వీడియోలో ఉంది. ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలో ఆందోళన కలిగిస్తున్నాయి. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన