Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేబులో చౌక ఫోన్.. పేలిపోయింది.. వృద్ధుడు సజీవదహనం..

జేబులో చౌక ఫోన్.. పేలిపోయింది.. వృద్ధుడు సజీవదహనం..
, శనివారం, 15 డిశెంబరు 2018 (11:25 IST)
స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం నడపదనేవారు చాలామందే వున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఎంత ప్రమాదమో చాలామంది గ్రహించట్లేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. రాజస్థాన్ సర్కారు అందించిన చౌక ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. రాజస్థాన్ సర్కారు అందజేసిన ఫోన్‌ను జేబులో పెట్టుకున్న పాపానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
జేబులో పెట్టుకున్న ఫోన్ పేలడంతో ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నెతావల్ గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్థాన్ సర్కారు రూ.1100కు అందజేసిన ఫోనును కొనుగోలు చేశాడు. ఈ ఫోన్‌ను రాత్రి నిద్రించేటప్పుడు కూడా జేబులో పెట్టుకున్నాడు. 
 
అంతే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జేబులో వున్న ఫోన్ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోనులోని ఛార్జర్ వేడి కావడంతోనే అది పేలిపోయిందని.. మంటలు దుస్తులకు బాగా అంటుకుపోవడంతో నిద్రలో వున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం